ETV Bharat / state

Khammam BRS Leaders Joining Congress : ఖమ్మంలో బీఆర్​ఎస్​కు వరుస షాక్​లు​.. జోరుగా కాంగ్రెస్​ ఆపరేషన్​ ఆకర్ష్​

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 8:21 AM IST

Khammam BRS Leaders Joining Congress : భీ-ఫారాల పంపిణీ, మేనిఫెస్టో ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో కోలాహలం నెలకొన్న తరుణంలో ఖమ్మంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆ జిల్లాలో పలువురు నేతలు బీఆర్​ఎస్​ని వీడారు. సీనియర్ నేత బాలసాని లక్ష్మీనారాయణ.. మాజీ ఎమ్మెల్సీ, మరో ముగ్గురు కార్పొరేటర్లు, ఇద్దరు మాజీ కార్పొరేటర్లు, మరికొంత మంది నాయకులు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి తుమ్మల, ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రంగంలోకి దిగి.. ఆపరేషన్ ఆకర్ష్‌కి తెర లేపారు. పార్టీలో పరిణామాలు చక్కదిద్దేందుకు మంత్రి పువ్వాడ అజయ్ రంగంలోకి దిగడంతో.. ఖమ్మం రాజకీయం కాక రేపుతోంది.

BRS Leaders who Joined Congress
BRS Leaders who Joined Congress in Khammam

BRS Leaders who Joined Congress in Khammam ఖమ్మంలో బీఆర్​ఎస్​కు షాక్​.. జోరుగా సాగుతున్న కాంగ్రెస్​ ఆపరేషన్​ ఆకర్ష్​

Khammam BRS Leaders Joining Congress : ఖమ్మం జిల్లా కేంద్రంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మంలో వేగంగా సమీకరణాలు మారుతుండటంతో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నేత బాలసాని లక్ష్మీ నారాయణ(Balasani Lakshmi Narayana resigned from BRS) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Congress Operation Akarsh in Khammam : ఆ తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా బాలసాని నివాసానికి చేరుకున్నారు. ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడంతో బాలసాని అంగీకరించారు. అనంతరం ఇద్దరు నేతలు.. వ్యూహాత్మకంగా ముగ్గురు బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు, మరికొంతమంది నాయకులను.. పార్టీలోకి స్వాగతించారు. బీఆర్​ఎస్​ సీనియర్ నాయకుడు, కార్పొరేటర్ కమర్తపు మురళితోపాటు కార్పొరేటర్లు చావా మాధవి నారాయణరావు, రావూరి కరుణ సైదుబాబు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరితోపాటు మరికొందరు నాయకులు కాంగ్రెస్ గూటికి చేరారు.

Political Heat in Paleru Constituency : రసవత్తరంగా పాలేరు పోరు.. ముఖ్య నేతల పోటీతో మారిన రాజకీయ సమీకరణాలు

Khammam Politics Latest 2023 : కేసీఆర్​ కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. ఖమ్మంలో ఆట మొదలైందని కాంగ్రెస్ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి ప్రజలే నాయకత్వం వహించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆత్మగౌరవం దెబ్బతినడం వల్లే బీఆర్​ఎస్​ని వీడాల్సి వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ బాలసాని అన్నారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల, పొంగులేటి ఆపరేషన్​ ఆకర్ష్​(Congress Operation Akarsh)కు తెరలేపారు.

"మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మీరందరూ నిరూపించాలని తద్వారా ఈ జిల్లా రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి మీరే సైనికులు కావాలని కోరుతున్నాను. మీ శక్తి సామర్థ్యాలు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి ఖమ్మం జిల్లా ప్రజల చైతన్య స్ఫూర్తిగానీ, వాళ్ల నిజాయతీ రాజకీయాలు గానీ, వాళ్ల ప్రజాహిత రాజకీయాల కోసం ప్రజలు ఏ రకంగా స్పందిస్తారో గత చరిత్ర మనకు తెలుసు. ఈనాడు జరుగుతున్న దుస్ఫపరిపాలనకు, అవినీతి పాలనకు ఫుల్​ స్టాఫ్​ పెట్టే సమయం దగ్గర పడింది." - తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి

Telangana Election Polls 2023 : ఖమ్మంలో జరిగిన రాజకీయ పరిణామాలు బీఆర్​ఎస్​ని కలవరానికి గురి చేసింది. మంత్రి పువ్వాడ అజయ్ హైదరాబాద్‌లో ఉండగా.. తుమ్మల, పొంగులేటి వ్యూహాత్మకంగా కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లడం బీఆర్​ఎస్​లో చర్చకు దారి తీసింది. అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి.. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న వారిని సంప్రదించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు.

హైదరాబాద్ నుంచే మంత్రి పువ్వాడ కార్పొరేటర్లకు ఫోన్ చేసి పార్టీని వీడొద్దని కోరినా వెనక్కి తగ్గలేదు. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో పువ్వాడ ఖమ్మం వెళ్లి కార్పొరేటర్లు, నియోజకవర్గ ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలో నెలకొన్న పరిణామాలపై చర్చించారు. అంతా పార్టీ గెలుపు కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

Political Heat in Khammam District : ఖమ్మంలో రాజుకుంటున్న రాజకీయం... ప్రచారాలు ప్రారంభించిన నేతలు

Thummala Nageswara Rao Meets Rahul Gandhi : దిల్లీలో రాహుల్​ గాంధీతో తుమ్మల నాగేశ్వర రావు భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.