ETV Bharat / state

Khammam BRS Election Plan 2023 : ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సన్నద్ధం.. ముఖ్య నేతలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జీ బాధ్యతలు - ఖమ్మం బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలు

Khammam BRS Election Plan 2023 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాచరణను మరింత వేగవంతం చేసింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్త జ్వాలలు చెలరేగడం, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గాల్లో సమన్వయానికి అధిష్ఠానం ముఖ్య నేతలను రంగంలోకి దించింది. నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించి.. ఎన్నికల క్షేత్రంలోకి దిగాలని ఆదేశాలు జారీ చేసింది.

Khammam BRS Election Plans
Khammam BRS Election Plans 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 7:01 AM IST

Khammam BRS Election Plans 2023 ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సన్నద్ధం అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణ మరింత వేగం

Khammam BRS Election Plan 2023 : 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా భారత్ రాష్ట్ర సమితి-అప్పటి టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్(Minister Puvvada Ajay) మాత్రమే విజయం సాధించారు. ఆ తర్వాత జిల్లాలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్​కు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది.

Telangana Assembly Elections 2023 : గత రెండు ఎన్నికలతో పోలిస్తే జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి(Ponguleti Srinivas Reddy) పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. కొత్తగూడెంలో జలగం వెంకట్రావు ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్నారు. పాలేరు టికెట్((BRS MLA Ticket 2023) ఆశించి భంగపడటంతో ఇటీవల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కార్యకర్తల సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని ప్రకటించారు.

BRS focus on Khammam Politics 2023 : ఈ పరిణామాల నడుమే అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించిన బీఆర్ఎస్.. పటిష్ఠ వ్యూహంతో ముందుకెళ్తోంది. ఒక్కరు మినహా మిగిలిన 9 స్థానాల్లో సిట్టింగులకే అవకాశం కల్పించింది. ఎన్నికల క్రతువుపై మరింత దూకుడు పెంచేందుకు గానూ ఇటీవల జిల్లా నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల వ్యూహాలు, జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచేలా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు.

Political Heat in Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రసవత్తర సమరం.. అసెంబ్లీ పోరుకు సై అంటే సై

Khammam Politics 2023 : తాజాగా మరో అడుగు ముందుకేసిన బీఆర్ఎస్ అధిష్ఠానం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు ముఖ్యనేతలను ఇంఛార్జీలుగా నియమించింది. మధిరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంఛార్జిగా నియమితులవగా.. సత్తుపల్లికు బండి పార్థసారధి రెడ్డి, భద్రాచలానికి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాలకు ఎంపీ నామా నాగేశ్వరరావును పార్టీ నియమించింది.

కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాలకు ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం నియోజకవర్గానికి మంత్రి పువ్వాడ అజయ్, పాలేరుకు కందాల ఉపేందర్​రెడ్డి, పినపాకకు రేగా కాంతారావులకే బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో ఎన్నికల కార్యాచరణ, సన్నద్ధత, ముఖ్య నాయకుల మధ్య సమన్వయం కోసం వీరికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఇప్పటికే నియోజకవర్గాల్లో సమన్వయ బాధ్యులకు పార్టీ అధిష్ఠానం నుంచి మౌఖిక ఆదేశాలు అందగా.. త్వరలోనే అధికారికంగా ఇంఛార్జీల ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Tummala Nageshwara Rao Rally in Khammam : 1000 కార్లు, 2 వేల బైకులతో తుమ్మలకు ఘన స్వాగతం

BRS Telangana Election Plan 2023 : వాస్తవానికి నియోజకవర్గ ఇంఛార్జీల జాబితాలో తొలుత మాజీ మంత్రి తుమ్మల(Thummala Nageswara Rao)కు చోటు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాపై ఈ నెల రెండో వారంలో జరిగిన సమీక్ష సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్.. నియోజకవర్గాల వారీగా పరిస్థితులపై చర్చించారు. ఇందులో భాగంగా ముఖ్యనేతలకు ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించాలని భావించారు.

ఈ జాబితాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అశ్వారావుపేట నియోజకవర్గం ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు. అయితే తాజా జాబితాలో మాత్రం ఆయనకు చోటు దక్కలేదు. అభ్యర్థుల ప్రకటన, ఆ తర్వాత పరిణామాలే ఇందుకు కారణమనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం బీఆర్ఎస్.. తుమ్మలకు మధ్య దూరం మరింత పెరుగుతూ వస్తోంది. తుమ్మల తదుపరి రాజకీయ అడుగులపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా తుమ్మలకు నియోజకవర్గ ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించకపోవడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జీగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసానికి కూడా సమన్వయ బాధ్యతలు ఇవ్వకపోవడంపై ఆ పార్టీ వర్గాల్లో రాజకీయంగా చర్చ సాగుతోంది.

Khammam MLA Ticket Issues : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ జోష్​.. గులాబీ గూటికి చేరిన వారందరికీ టికెట్లు

Khammam Congress Leaders Joined BRS : 'ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కే వెేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.