కార్తిక సోమవారం సందర్భంగా ఖమ్మంలోని శివాలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు తెల్లవారుజాము నుంచే కార్తిక దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. నగరంలోని గుంటు మల్లేశ్వర ఆలయంలో, రోటరీ నగర్లోని రాజరాజేశ్వరి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో ఆలయాల ప్రాంగణాలు కళకళలాడాయి.
ఇవీ చూడండి: భక్తుల సొమ్ము.. గోవిందా.. గోవింద!