ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య 55 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసారు. రాష్ట్రం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్నా సంక్షేమ పథకాల అమలులో సీఎం వెనకాడటం లేదని సండ్ర అన్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో తహసీల్దార్లు సక్రమంగా పనిచేస్తున్నారని పట్టాదారు పాసు పుస్తకాలను తొందరలోనే జారీ చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండిః ఆత్మహత్యే శరణ్యమని మహిళల కంటతడి