దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఖమ్మంలో ఐద్వా ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమం నిర్వహించారు. ధర్నా చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చిన మహిళలు, కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. దేశంలో స్త్రీలకు రక్షణ కల్పించాలని... మగవారితో పాటు సమాన వేతనం ఇవ్వాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు భారతి డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : తెలంగాణలో అప్రజాస్వామిక పాలన: సీఎల్పీ నేత భట్టి