అత్యాధునిక హంగులతో ఖమ్మంలో ఐటీహబ్ కొలువుదీరింది. డిసెంబర్ 7న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యకలాపాలను 16 బహుళ జాతి సంస్థలు ప్రారంభించాయి. ఐటీహబ్‌లో 300 మంది ఇంజినీర్లు ఉద్యోగాలు చేస్తున్నారు. జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందిన యువ ఇంజినీర్లు... సొంత జిల్లాలోనే ఐటీ ఉద్యోగాలు చేయడంపై సుముఖత వ్యక్తం చేశారు.
భద్రత పరంగా అమ్మాయిలకు సొంత జిల్లాలో ఐటీహబ్ ఉత్తమంగా భావిస్తున్నారు. ఉద్యోగాల కోసం మెట్రో నగరాల బాట పట్టాల్సిన అవసరం లేదని.. ఇంటి అద్దెలు, అనవసర ఖర్చులు తగ్గుతాయని యువ టెక్కీలు చెబుతున్నారు. జిల్లాలోనే పిల్లలకు ఉద్యోగాలు లభించడంపై తల్లిదండ్రుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : సైబర్ నేరాలపై షార్ట్ ఫిల్మ్.. విడుదల చేసిన సీపీ సజ్జనార్