ETV Bharat / state

సమస్యలపై కదం తొక్కిన విద్యార్థులు

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇంటర్​ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన , మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

సమస్యలపై కదం తొక్కిన విద్యార్థులు
author img

By

Published : Aug 5, 2019, 6:02 PM IST

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థులు కదం తొక్కారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మహిళా జూనియర్‌ కళాశాల నుంచి కలెక్టరేట్​ వరకు వందలాది మంది ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలుచేయాలని, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్​ చేశారు. ఇంటర్ విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అధ్యాపకులు కొరత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

సమస్యలపై కదం తొక్కిన విద్యార్థులు
ఇవీ చూడండి: శ్రమజీవుల బతుకులను చిదిమేసిన రోడ్డు ప్రమాదం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.