పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్న ఆయనను కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రామయ్యను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిందిగా వారికి సూచించారు.
వైద్యుల సూచనతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎంజీ ఆస్పత్రికి రామయ్యను తీసుకొచ్చారు. ఆయనకు గతంలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.