ETV Bharat / state

జోరుగా ఇసుక అక్రమ దందా.. పట్టించుకోని ఆధికారులు ! - sand illegal transport

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని అంజనాపురం అడ్డగా అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతుంది. స్థానిక చెరువులో పట్టపగలు ఇసుక తవ్వతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

illegal sand transport at anjanapuram village konijerla mandal khammam district
జోరుగా ఇసుక అక్రమ దందా.. పట్టించుకోని ఆధికారులు !
author img

By

Published : Sep 18, 2020, 5:30 PM IST

భారీ వర్షాలకు వాగుల్లో కొట్టుకొచ్చిన ఇసుకను కుప్పగా చేసి కొందరు అక్రమార్కులు దందా కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం అడ్డగా కొన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఏటిలో పట్టపగలు ఇసుక తోడుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ గ్రామంలో కూడళ్లు, ఇళ్ల వద్ద ఇసుక కుప్పలుగా పోసి అనధికారంగా నిల్వ చేస్తున్నా.. అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఇటీవల ఏటి వద్ద అధికారులు దాడులు చేసి ట్రాక్టర్లు వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రతి రోజు 50 వరకు ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నారు. గ్రామ కూడలిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ట్రాక్టర్లకు నింపుతున్నారు. గ్రామపంచాయతీలలో అభివృద్ధి పనులు జోరుగా సాగడం వల్ల ఇసుకకు భారీగా గిరాకీ పెరిగింది. దీన్ని అదునుగా చేసుకొని అంజనాపురంలో కొందరు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి దందా కొనసాగిస్తున్నారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే ట్రాక్టర్లను అడ్డుకోవడం తాము అధికారులకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నామని బెదిరంపులకు పాల్పడుతున్నారు.

ఆ ఆరు ట్రాక్టర్లే ఎక్కువగా....

అంజనాపురంలో ఆరు ట్రాక్టర్లు నిత్యం ఇసుకను రవాణా చేస్తున్నాయి. నీళ్లు వచ్చే సమయంలోనే కూలీల ద్వారా ఒడ్డుపై కుప్ప పోయించి గ్రామానికి తరలిస్తున్నారు. అక్కడ డంప్‌ చేసిన ఇసుకను రూ.6వేలకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ అనేకసార్లు పట్టుబడినా పోలీస్‌, రెవెన్యూ అధికారులు నామమాత్రంగా జరిమానాలు విధిస్తున్నారు. రెండోసారి పట్టుబడిన ట్రాక్టర్‌ను సీజ్‌ చేయాల్సి ఉండగా అలా చర్యలు తీసుకోవడం లేదు.

అక్కడా ఇదే పరిస్థితి...

జిల్లాలోని పగిడేరు, జన్నారం, అంజనాపురం, ఏన్కూరు మండలంలోని పలు వాగుల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇష్టానుసారం వాగుల్లో గోతులు పెడుతున్నారని ఆ వరద పొలాలపై పడుతుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తవ్వకాలకు అనుమతి లేదు..

అక్కడ ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవన్న కొణిజర్ల తహసీల్దార్‌ కృష్ణ.. తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: వర్షం పడితే నీళ్లు రాకపోతే... నిప్పులు వస్తాయా?: మంత్రి తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.