భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు భాజపా నాయకుడు బిందె కుటుంబరావు కరోనాతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని ఇల్లందుకు తీసుకవచ్చిన కుటుంబ సభ్యులు కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ... అంత్యక్రియలు పూర్తి చేశారు.
బిందె కుటుంబరావుకు ఈ నెల 7వ కరోనా పాజిటివ్‌గా కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో నిర్ధారణ అయింది. మెరుగైన వైద్య చికిత్సల కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన మంగళవారం మృతి చెందారు. కుటుంబరావు మృతిపట్ల ఇల్లందులోని వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలియజేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు