ETV Bharat / state

ఖమ్మం గెలిస్తే... తెలంగాణ గెలుస్తాం: మాణికం ఠాగూర్ - Khammam congress meeting

ఖమ్మం గెలిస్తే తెలంగాణ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్. ఖమ్మం నగరపాలక సంస్థ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నేతలు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఖమ్మం గెలిస్తే... తెలంగాణ గెలుస్తాం: మాణికం ఠాగూర్

author img

By

Published : Feb 7, 2021, 4:53 PM IST

Updated : Feb 7, 2021, 5:33 PM IST

ఖమ్మం నుంచే మళ్లీ కాంగ్రెస్ శంఖారావం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్‌. 2018లో కాంగ్రెస్‌కు తిరుగులేదని నిరూపించిన జిల్లా ఖమ్మం అని ఆయన గుర్తుచేశారు. కార్యకర్తల కష్టంతో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని మార్చి మోసం చేశారని మండిపడ్డారు.

ఖమ్మం నగరపాలక సంస్థ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ నాయకత్వం... శ్రేణుల్ని సన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మంలో ఆ పార్టీ రాష్ట్రనేతలు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్, ఉత్తమ్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు, 33 జిల్లాలు, పట్టణ, నగరాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని మాణికం ఠాగూర్‌ ఆదేశించారు.

ప్రతి డివిజన్‌లో గెలిస్తే.. ఖమ్మం గెలుస్తాం. ఖమ్మం గెలిస్తే తెలంగాణ గెలుస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఖమ్మం గెలవాలి. తెరాస- భాజపా దిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ చేస్తున్నాయి. ఆరేళ్లలో కేసీఆర్‌ రాష్ట్రాన్ని దోచుకున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తిస్తాం. పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలను తిరిగి చేర్చుకునేది లేదు.

-- మాణికం ఠాగూర్‌, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్

రాష్ట్రవ్యాప్తంగా తెరాస ప్రభుత్వం దాచుకోవడం, దోచుకోవడం తప్ప వేరే ఏం చేయడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్​రెడ్డి మండిపడ్డారు. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఐకేపీ సెంటర్లపై మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఖమ్మం గెలిస్తే... తెలంగాణ గెలుస్తాం: మాణికం ఠాగూర్

ఇదీచూడండి: ఖమ్మంలో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం

Last Updated : Feb 7, 2021, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.