ETV Bharat / state

'రిజిస్ట్రేషన్​ భూముల్లో కట్టుకున్న ఇళ్లు ఎలా కూల్చేస్తారు...?' - అక్రమంగా కట్టిన ఇళ్లను కూల్చేసిన ఖమ్మం అధికారులు

ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కుల్చేస్తున్నామని అధికారుల ఆగ్రహం... కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్​ చేసుకుని నిర్మించుకున్న ఇళ్లను ఎలా కూల్చేస్తారని బాధితుల ఆందోళనలతో మహబూబాబాద్​లో పత్తిపాక ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాధితులు ఎంత అడ్డుకున్నా... మొత్తానికి అధికారులు ఆ స్థలంలో నిర్మించిన ఇళ్లను మాత్రం నేలమట్టం చేశారు.

HOUSES DEMOLISH WHICH WERE CONSTRUCTED IN GOVERNMENT PLACE IN KHAMMAM

author img

By

Published : Feb 11, 2020, 6:02 PM IST

మహబూబాబాద్​లోని పత్తిపాక, బాబు నాయక్ తండా, రెడ్యా నాయక్ కాలనీలలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూములలో నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో ఓ మహిళ బాధితురాలు ఆత్మహత్యకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు.

పర్మిషన్లు ఇచ్చినప్పుడు తెలీదా...?

ప్రభుత్వ భూములను ఆక్రమించలేదని... గతంలో ఆ స్థలాలను తాము కొనుగోలు చేసినట్లు బాధితులు స్పష్టం చేశారు. నిర్మాణాలు పూరై.... ఇంటి నంబర్లు, విద్యుత్ కనెక్షన్లు సైతం తీసుకున్నాక... ఇప్పుడు కూల్చివేయడమేంటని ప్రశ్నించారు. అప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి... ఇళ్లకు పర్మిషన్లు ఇచ్చి... ఇన్ని రోజులు నివాసమున్నాక ఇప్పుడు కూల్చేస్తే ఎక్కడికెళ్లాలంటూ... బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న డబ్బులతో నిర్మించుకున్న గూడు కూల్చేస్తే... తమ బతుకులు రోడ్డున పడినట్లేనని... కలెక్టర్​ ఈ విషయంపై దృష్టిసారించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

ప్రభుత్వ భూమిలో నిర్మిస్తే ఇంతే...

మరోవైపు... 504 సర్వే నంబర్ గల స్థలం ప్రభుత్వ భూమేనని... ఆర్టీఓ కొమురయ్య వెల్లడించారు. ఇది ఆరంభం మాత్రమేనని... ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న అన్ని నిర్మాణాలను కూల్చేయనున్నట్లు ఆర్డీవో స్పష్టం చేశారు. అక్రమార్కుల చర్యలను ఉపేక్షించేది లేదని... క్రిమినల్​ కేసులు పెడతామని హెచ్చరించారు.

'రిజిస్ట్రేషన్​ భూముల్లో కట్టుకున్న ఇళ్లు ఎలా కూల్చేస్తారు...?'

ఇదీ చూడండి : ఆప్​ కీ దిల్లీ:​ మరోసారి దిల్లీ పీఠంపై 'సామాన్యుడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.