రంగుల పండుగ హోలీని ఖమ్మం జిల్లా ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో చిన్నారులు తమ స్నేహితులకు రంగులు పూసుకుంటు తిరిగారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా హోలీ సంబురాల్లో పాల్గొని... పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
![Young people dancing in Khammam district, holi celebrations in khammam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11202019_jml.png)
కొన్ని ప్రాంతాల్లో డిజే పాటలను ఏర్పాటు చేసుకుని... నృత్యాలు చేస్తూ ఉత్సహంగా గడిపారు. కరోనా నిబంధనలు అమలులో ఉండటంతో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు వేడుకలకు దూరంగా ఉన్నారు.
![holi celebrations in khammam district, Holi celebrations in accordance with the Kovid rules](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11202019_jll.png)
ఇదీ చదవండి: నోముల వారసుడికే నాగార్జునసాగర్ టికెట్