ఖమ్మం జిల్లా మధిరకు చెందిన హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ... పేదలకు అండగా నిలుస్తోంది. సహకార బ్యాంకు మేనేజర్ అత్తలూరి మధులికతోపాటు మరికొంత మంది స్నేహితులు కలిసి... తమ నెలవారి వేతనం నుంచి కొంత మొత్తాన్ని పోగుచేసి పేదలకు సాయమందిస్తున్నారు.
మధిరలోని పలు ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస రావు, తెరాస నాయకులు చెరుకూరి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.