భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని జలశయాల్లో పూర్థిస్థాయి నీటిమట్టం పెరిగి అలుగుల ద్వారా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో ప్రధానమైన వైరా జలాశయం నీటి సామర్థ్యం 18 అడుగులు కాగా మూడురోజులుగా 20 అడుగులు దాటింది. ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి, ఏన్కూరు మండలాల్లో అటవీ ప్రాంతం నుంచి వరదనీరు భారీగా చేరడంతో జలాశయంలో రోజు రోజుకు నీటి మట్టం పెరుగుతోంది.
ఏరు వాగు ఉద్ధృతం...
జలాశయం 3 అడుగుల మేర దిగువకు వరదనీరు చేరడం వల్ల ఏరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలైన వైరా మండల పరిధిలోని పలు గ్రామాలకు చేరువలో ఏరు ప్రవహిస్తుంది. ఇప్పటికే స్నానాల లక్ష్మీపురం వద్ద వంతెనపై నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. కొణిజర్ల మండలంలో పగిడేరు నిమ్మవాగు వరదతో పోటెత్తడంతో రాకపోకలు స్తంభించాయి. అంజనాపురం వద్ద ఏరు ప్రవాహంతో ఖమ్మం- కొత్తగూడెం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏన్కూరు, జూలూరుపాడు, వైరా మండలంలో వరి, ప్రత్తి, ఇటీవల నాటిన మిరప పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి.
ఇవీ చూడండి : ఎడతెరిపిలేని వర్షాలు... మేడారాన్ని చుట్టేసిన వరద నీరు