ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో భారీవర్షం బీభత్సం సృష్టించింది. రెండు గంటలపాటు కురిసిన కుండపోత వర్షానికి పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవహించి ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఏన్కూరు మండలం శ్రీరామగిరి వద్ద రహదారి కోతకు గురయింది. పలు చోట్ల మట్టిదారులు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. వాగులు, చెరువులు పొంగి పొర్లాయి.
శ్రీరామగిరి వాగు ఉద్ధృతికి ఆయకట్టు పొలాలు నీట మునిగి దెబ్బతిన్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి ప్రత్తిసాగు నేలవాలగా వాటిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతులకు భారీవర్షం మరింత నష్టాన్ని మిగిల్చింది. పూత, కాయ కుళ్లిపోవడం వల్ల రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అధిక ధరకు కొని నాటిన మిరప నారు.. వరదకు కొట్టుకుపోయి.. తీరని నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏన్కూరు- కొణిజర్ల మండలాల మధ్య వాగులు రోజంతా పొంగి ప్రవహించడం వల్ల ఖమ్మం- కొత్తగూడెం మధ్య నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: 'రాజ్యసభకే అవమానకరమైన రోజు ఇది'