వాయుగుండం ప్రభావంతో ఖమ్మం జిల్లాలోని వైరా, సత్తుపల్లిలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. కుండపోతగా కురిసిన వర్షంతో జనజీవనం అతలాకుతలం అయింది. వరదనీటిలో చిక్కుకున్న వస్తువులు కాపాడుకోవడానికి ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
నీటిపాలు
తల్లాడ మండలం కుర్నవల్లి ఉన్నత పాఠశాల వరద నీరు చేరింది. పాఠశాలలో నిల్వ చేసిన బతకమ్మ చీరలు, రేషన్ బియ్యం నీటి పాలయ్యాయి. అదే గ్రామంలో వరిపొలాలు జలమయం అయ్యాయి. 20 గొర్రెలు మృత్యువాత పడగా మరో 20 గాయాల పాలయ్యాయి. గొర్రెల కాపరులు కన్నీటి పర్యంతమయ్యారు.
నిలిచిన రాకపోకలు
సత్తుపల్లి- ఖమ్మం జాతీయ రహదారిలో వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు బోల్తా పడ్డాయి. రహదారుల వెంట చెట్లు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: పాక్ ఆయుధ స్మగ్లింగ్ కుట్ర భగ్నం