GruhaLakshmi Scheme in Telangana : గృహలక్షి పథకానికి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు పోటెత్తాయి. తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, కార్పొరేషన్, పురపాలికలు, కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి.. దరఖాస్తులు స్వీకరించారు. ఆయా కార్యాలయాలు ఆశావహుల తాకిడితో కిక్కిరిసిపోయాయి. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించడంతో ఆశావహులు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 65 వేల 240 దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం తొలి దఫాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇళ్లు కేటాయించింది. సుమారు 30 వేల ఇళ్లు మంజూరు కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Huge Applications for Gruhalaxmi Scheme : గృహలక్ష్మి పథకానికి నోడల్ అధికారులుగా.. కలెక్టర్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుకు సొంత ఇంటి జాగా ఉండాలి. పక్కా ఇల్లు ఉండకూడదు. ఆహార భద్రత కార్డు ఉండాలి. జీవో నెంబరు 59 కింద లబ్ది పొంది ఉండకూడదు. ఆ నిబంధనల మేరకు రెవెన్యూ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. వచ్చిన దరఖాస్తులను గ్రామాలు, వార్డుల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అసలైన అర్హులను తేల్చనున్నారు. ఈ నెల 20 వరకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత తొలి విడత అర్హుల జాబితా ప్రకటించనున్నారు. వచ్చే నెల తొలి వారంలో తొలి విడత నిధులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సిఫారసు ఆధారంగా అర్హుల జాబితా అధికారికంగా నెలాఖరులో ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫారసు కోసం వస్తున్న దరఖాస్తుదారులతో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, నివాసాల వద్ద సందడి నెలకొంది. నేతల కటాక్షానికి జనం బారులు తీరుతున్నారు. ఈ తరుణంలో గృహలక్ష్మి కటాక్షం లభిస్తుందో లేదోనని నిరుపేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Gruhalaxmi Scheme Guidelines : 'గృహలక్ష్మి పథకం'.. మార్గదర్శకాలు తెలుసుకోండి..
గృహలక్ష్మి మార్గదర్శకాలు ఇలా..: గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. 100 శాతం రాయితీతో ఆర్థిక సాయం అందించనున్నారు. నియోజక వర్గానికి 3000 మంది చొప్పున లబ్దిదారులకు సాయం అందిస్తారు. స్టేట్ రిజర్వ్ కోటాలో మరో 43 వేలు.. మొత్తంగా 4 లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద లబ్ది చేకూరనుంది. జిల్లాల్లో పాలనాధికారులు, జీహెచ్ఎంసీలో కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి అమలు కానుంది. ఈ అధికారులే నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. మహిళల పేరు మీదే గృహలక్ష్మి ఆర్థిక సాయం అందిస్తారు. ఇందుకోసం లబ్దిదారు మహిళ పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉంటుంది. జన్ ధన్ ఖాతాను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదు.
గృహలక్ష్మికి అప్లై చేసేందుకు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి..
గృహలక్ష్మి పథకం దరఖాస్తు ఫారం
రేషన్ కార్డు
ఓటరు గుర్తింపు కార్డు
ఆధార్ కార్డు
ఇంటి స్థలం దస్తావేజులు (దస్తావేజులు లేకపోతే ప్రస్తుత ఇంటి నెంబర్ తెలిపిన సరిపోతుంది)
Gruha Lakshmi Scheme Last Date Today : 'గృహలక్ష్మి'కి నేడే లాస్ట్ డేట్.. అప్లై చేసుకున్నారా..?