ఖమ్మం జిల్లా ఖానాపురం మండలంలోని గ్రానైట్ కార్మికులు తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఖానాపురం నుంచి ఖమ్మం కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయల్దేరిన వారిని ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో కార్మికులు వాగ్వాదానికి దిగారు. తాము ఇక్కడ ఉండలేమని... సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో భారీగా చేరుకున్న పోలీసులు కార్మికులకు సర్దిచెప్పడం వల్ల వారు శాంతించారు.
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో కార్మికుల వివరాలు సేకరించిన తర్వాత... వారిని స్వస్థలాలకు పంపే చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం దాదాపు 70 వేల మంది వలస కార్మికులు ఉండగా... ఇప్పటికే 30 వేల మంది కార్మికులు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రీన్ జోన్లోకి ప్రవేశించగా... ఖమ్మం జిల్లాలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
ఇదీ చూడండి: దేశ వ్యాప్తంగా 27.11 శాతం పెరిగిన నిరుద్యోగ రేటు