ETV Bharat / state

జిల్లా పరిషత్‌ విభజనకు రంగం సిద్ధం

అరవై ఏళ్ల ఖమ్మం జిల్లా పరిషత్‌ విభజనకు రంగం సిద్ధమైంది. ఖమ్మం జిల్లా పరిషత్‌ ఆగస్టు 7వ తేదీ నుంచి ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా పరిషత్‌లుగా ఏర్పాటు కానుంది. ఇప్పటికే రెండు జడ్పీలకు నూతన పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. వారు ఆగస్టు 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

http://10.10.50.8జిల్లా పరిషత్‌ విభజనకు రంగం సిద్ధం5:6060//finalout4/telangana-nle/thumbnail/17-July-2019/3861344_649_3861344_1563332734036.png
author img

By

Published : Jul 17, 2019, 12:32 PM IST

ఖమ్మం జిల్లా పరిషత్‌ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడుతున్న భద్రాద్రికొత్తగూడెం జిల్లా పరిషత్‌ కార్యాలయాన్ని కొత్తగూడెం మండల పరిషత్‌ కార్యాలయంలో తాత్కాలికంగా నిర్వహించనున్నారు. ఇదే ఆవరణలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ డివిజన్‌ కార్యాలయం భవనాలను వినియోగించనున్నారు. ఖమ్మం జిల్లా పరిషత్‌ నుంచి భద్రాద్రి కార్యాలయానికి దామాషా ప్రకారం కుర్చీలు, బెంచీలు, కంప్యూటర్లు, ఫ్యాన్లు, ర్యాక్‌లు, వాహనాలు పంపిణీ చేయాలి. దీంతోపాటు ఉద్యోగులను సైతం వారి కేటగిరీల వారీగా విభజించి కొందరిని నూతన జిల్లా పరిషత్‌కు పంపనున్నారు. ఇందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మేరకు కలెక్టర్‌ కర్ణన్‌ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేసి, ఆగస్టు 6వ తేదీన ‘ఆర్డర్‌ టు సర్వ్‌’ పేరిట ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇలా జారీ చేసిన ఉత్తర్వులను ఉద్యోగులుకచ్చితంగా అంగీకరించి తీరాలి.

ఖమ్మం జిల్లా పరిషత్‌ పరిధిలో ప్రస్తుతం 41 మండలాలున్నాయి. ఆయా మండలాల్లో పనిచేస్తున్న పలు పాఠశాలల ఉపాధ్యాయులు, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్‌ (జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌) ఖాతాలను ఖమ్మం జడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తారు. ప్రతి ఉద్యోగికి జీపీఎఫ్‌ ఖాతా వివరాలు అత్యంత ప్రధానం. ఈ ఖాతాలో ఉద్యోగులకు సంబంధించిన డబ్బు జమవుతుంది. ఆ డబ్బు ప్రభుత్వం వద్ద ఉంటుంది. ఉద్యోగులకు అవసరమైనపుడు అర్హత మేరకు రుణం మంజూరు చేస్తుంటారు. ఉద్యోగ విరమణ తర్వాత జీపీఎఫ్‌ ఖాతాలోని మొత్తం సొమ్మును వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లిస్తుంది. అత్యంత ప్రాధాన్యం ఉన్న జీపీఎఫ్‌ ఖాతాల్లో గత రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి సరైన నమోదులు కాలేదని ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు జడ్పీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.

ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలను అప్‌డేట్‌ చేయాలి

జిల్లా పరిషత్‌ విభజన దగ్గర పడిన నేపథ్యంలో ఉమ్మడి జడ్పీ పరిధిలోని ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలను అప్‌డేట్‌ చేయాలని సీఈవో ప్రియాంక ఆదేశించారు. దీంతో జడ్పీ గణాంక అధికారి వింజం వెంకట అప్పారావు ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించి నవీకరణ చేపట్టారు. కలెక్టరేట్‌ ఆవరణలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని 25 కంప్యూటర్లలో వారం రోజులుగా ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మండలాల వారీగా పలు అంశాలకు సంబంధించిన రికార్డులు ఖమ్మం జడ్పీలో ఉన్నాయి. వాటిని ఖమ్మంలో డిజిటలైజేషన్‌ చేస్తున్నారు. దస్త్రాలు, పుస్తకాలు, ఇతర వివరాలతో కూడిన ఫైళ్లను స్కానింగ్‌ చేసి కంప్యూటర్లలో భద్రపరుస్తున్నారు. కొత్త జిల్లాకు రికార్డులు అప్పగించినా పూర్వ రికార్డు ఖమ్మంలో అందుబాటులో ఉండేందుకు డిజిటలైజేషన్‌ చేస్తున్నారు.

పంపకాలపై కసరత్తు

ఆగస్టు 7నుంచి నూతన జిల్లా పరిషత్‌లు మనుగడలోకి రానున్నాయని జడ్పీ గణాంకాధికారి వింజం వెంకట అప్పారావు వెల్లడించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రెండు జిల్లా పరిషత్‌లకు సామగ్రి, ఉద్యోగుల పంపకాలపై కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ కర్ణన్‌, జిల్లా పరిషత్‌ సీఈవో ప్రియాంక తుది నిర్ణయం తీసుకుని, అవసరమైతే కొన్ని మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంటుంద్నారు అప్పారావు. వారి నిర్ణయం మేరకు విభజన ప్రక్రియ జరుగుతోందని, ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నవీకరణ విభజన నాటికి పూర్తవుతుందని జడ్పీ గణాంకాధికారి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: 'కర్ణాటకీయం'పై సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.