ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మంలో దీక్షలు ప్రారంభించారు. ఖమ్మం ధర్నా చౌక్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఐదున్నర ఏళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించలేదని... చాలా మంది పదోన్నతులు పొందకుండానే పదవీ విరమణ చేశారని వాపోయారు. తక్షణమే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
హిందీ పండిట్‌లను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బదిలీలు, పదోన్నతులు కల్పించాలి: కోదండరాం