ఇవీ చూడండి :పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే పోటీ చేస్తాం: రైతులు
గుండెనొప్పితో వైద్యశాఖ ఉద్యోగి మృతి
ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు గేదెలను పెంచుతూ పాల వ్యాపారం చేస్తున్నాడు. ఎప్పట్లాగే సైకిల్ మీద పాలు తీసుకొని వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన గుండె నొప్పితో అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.
అకస్మాత్తుగా గుండె పోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగి
ఖమ్మం జిల్లా మధిరలో సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా గుండె పోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో నివాసం ఉండే శ్రీనివాసరావు ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎల్.డి.సిగా పనిచేస్తున్నాడు. ఇంటి వద్ద గేదెలను పెంచుతూ స్థానికంగా పాలను విక్రయిస్తున్నాడు. రోజులాగే సోమవారం కూడా పాలను ఖాతాదారులకు అందించి సైకిల్‌పై తిరిగి ఇంటికి వెళ్తుండగా మధిర బ్రిడ్జిపై ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే కిందపడిపోయాడు. వాహనదారులు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేసరికే శ్రీనివాసరావు చనిపోయాడు.
ఇవీ చూడండి :పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే పోటీ చేస్తాం: రైతులు
Intro:tg_kmm_2_25_cycle py velthu kuppakuli udyogi mruthi_av_-c1_kit no 889 సైకిల్ పై వెళుతూ ఓ వ్యక్తి ఒక్కసారిగా గుండె పోటుకు గురై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా మధిరలో చోటుచేసుకుంది మదర్ లోని 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో నివాసం ఉండే అలవాటు శ్రీనివాసరావు ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎల్ డి సి గా పనిచేస్తున్నారు ఇంటి వద్ద అ గేదెలను పెంచుతూ ప్రత్యామ్నాయంగా ప్రతిరోజు పట్టణంలో పాలను విక్రయిస్తున్నాడు సోమవారం కూడా అ పాలను ఖాతాదారులకు ఇచ్చి సైకిల్ పై తిరిగి ఇంటికి వెళ్తుండగా మధిర బ్రిడ్జి పై ఒక్క సారిగా గుండె నొప్పితో కుప్పకూలిన పడిపోయాడు వాహనదారులు అందరూ చూస్తుండగానే కిందపడిపోవడంతో 108కి సమాచారం అందించారు అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందాడు
Body:కె.పి
Conclusion:కె.పి
Body:కె.పి
Conclusion:కె.పి
Last Updated : Mar 25, 2019, 1:03 PM IST