ETV Bharat / state

మురికి కూపం నుంచి అందమైన పార్క్​గా ... ఎక్కడంటే - telangana latest news

Gollapadu canal Khammam district: మురికి కూపంగా మారి ఖమ్మం నగర వాసులకు దశాబ్దాలుగా పట్టి పీడించిన గోళ్లపాడు కాలువ ఇప్పుడు అదే నగర సిగలో మరో మణిహారంగా మారింది. కాలువ ఆధునీకీకరణ పేరుతో దశాబ్దాల గతానికి అభివృద్ధి నగిషీలు తొడిగి నేడు ముగ్ధ మనోహరంలా మారింది. నాటి మురికికూపం నుంచి నేడు నగరం మురిసేలా జరిగిన అభివృద్ధి నగరవాసుల్ని ముచ్చట గొలుపుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ కేటాయించిన 100 కోట్ల ప్రత్యేక నిధులతో నగరవాసుల దశాబ్దాల వెతలు తీరడమే కాదు.. నగరానికే వన్నె తెచ్చేలా గోళ్లపాడు ఛానెల్ నిలుస్తోంది

PARK
PARK
author img

By

Published : Feb 28, 2023, 3:31 PM IST

Gollapadu canal Khammam district: ఖమ్మం నగరాన్ని దశాబ్దాలుగా పట్టి పీడించిన గోళ్లపాడు ఛానెల్ గత చరిత్రను మార్చుకుని నేడు నగరానికే మరో మణిపూసగా మారింది. ఎటుచూసినా మురుగుతో ముక్కుపుటలు అదిరే దుర్వాసనతో నగర వాసులకు నిత్యనరకంగా మారిన గోళ్లపాడు కాలువ ఇప్పుడు నగరవాసులకే కాదు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మొత్తం 10.60 కిలోమీటర్ల పాటు గోళ్లపాడు ఛానెల్ ఆధునికీరణ పేరుతో చేసిన అభివృద్ధితో ఎటుచూసినా ఆహ్లాదం, అందమైన ఫౌంటేన్లు, పచ్చదనంతో ఫరిడవిల్లుతోంది.

గోళ్లపాడు ఛానెల్ ఆధునికీకరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధుల కింద 70 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత గోళ్లపాడు కాల్వపై సుందరీకరణ కోసం మరో 30 కోట్లు కేటాయించటంతో మొత్తం 100 కోట్లతో అద్భుతమైన పురోగతి సాధించిన గోళ్లపాడు ఛానెల్​ నగరాన్ని మరింత మనోహరంగా కనిపించేలా చేస్తోంది.
గోళ్లపాడు కాలువపై మొత్తం 10.60 కిలోమీటర్ల పొడవున భూగర్భంలో ప్రత్యేకంగా మురుగు నీటి వ్యవస్థ, పైన మొత్తం సుందరీకరణ చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దారు.

కాల్వ పొడవునా ఎక్కడ చూసినా ఆహ్లాదం, ఆటవిడుపే దర్శనమిస్తుంది. చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా పెద్దలకు ఆటవిడుపు కోసం క్రీడా ప్రాంగణాలు, పార్కులు ఏర్పాటు చేశారు. ఎటుచూసినా వాకింగ్ ట్రాక్ లు, ఓపెన్ జిమ్ లు, గోడలకు వాల్ ప్రాజెక్టులు, ఆక్యుపెంచర్ పార్కులు, పదుల సంఖ్యలో పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. దీంట్లో వివిధ రకాలైన 5 వేల మొక్కలు నాటారు. షటిల్, వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టులు అందుబాటులోకి తెచ్చారు. అన్నిచోట్లా మొబైల్ టాయ్ లెట్స్ అందుబాటులో ఉంచారు.

రాత్రి పూట ఎల్​ఈడీ వెలుగులతో గోళ్లపాడు ఛానెల్ సరికొత్త అందాలు సంతరించుకుంటోంది. ఛానెల్ పై నిర్మించిన పార్కులకు తెలంగాణ వైతాళికుల పేర్లు పెట్టడం మరో విశేషం. పార్కులకు ప్రొ.జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ, పుచ్చలపల్లి సుందరయ్య, పద్మశ్రీ వనజీవి రామయ్య, మహమ్మద్ రజబ్ అలీ, మంచికంటి రామకిషన్​రావుల పేర్లు పెట్టారు.

రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా గోళ్లపాడు ఛానెల్ పై ఏర్పాటు చేసిన చెస్ పార్కు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన స్కేటింగ్ రింకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చెస్ పార్కు అబ్బురపరుస్తోంది. పంజాబ్ నుంచి చెస్ కాయిన్స్ తెప్పించారు. రాష్ట్రంలోనే తొలి చెస్ పార్కుగా ఇక్కడే కొలువుదీరింది.

ఇక సుందరయ్య పార్కులో ప్రత్యేకంగా రూపొందించిన స్కేటింగ్ రింకు కోర్టు ఆకట్టుకుంటోంది. నాలుగేళ్లలోనే అనూహ్యరీతిలో మార్పుతో స్థానికులు, నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆధునికీకరణ పనులు పూర్తి చేసుకున్న గోళ్లపాడు ఛానెల్ త్వరలోనే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించేందుకు బల్దియా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.