ETV Bharat / state

రాజ్యసభ స్థానానికి ఇవాళ నామినేషన్ వేయనున్న వద్దిరాజు రవిచంద్ర - TRS names industrialists as its Rajya Sabha candidates

Gayatri Ravi Nomination: రాజ్యసభ స్థానానికి తెరాస అభ్యర్థిగా గాయత్రి రవి ఇవాళ 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజ్యసభకు బండ ప్రకాష్ రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆ ఖాళీ భర్తీ కోసం జరగనున్న ఉపఎన్నిక కోసం గాయత్రి రవిని తెరాస అధినేత కేసీఆర్​ ఎంపిక చేశారు. ఈనెల 23న నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవ ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు.

రాజ్యసభ స్థానానికి ఇవాళ నామినేషన్ వేయనున్న వద్దిరాజు రవిచంద్ర

author img

By

Published : May 19, 2022, 4:52 AM IST

Gayatri Ravi Nomination: తెరాస రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఖమ్మం జిల్లాకు బంపర్ ఆఫర్ దక్కింది. ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల జాబితాలో ఖమ్మం జిల్లా నుంచే ఇద్దరికి చోటు దక్కింది. ప్రముఖ హెటిరో డ్రగ్స్ అధినేత, బండి పార్థసారథిరెడ్డి, గాయత్రి గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత వద్దిరాజు రవిచంద్రను... తెరాస రాజ్యసభ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. అందులో వద్దిరాజు రవిచంద్ర ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గాయత్రి రవి ప్రముఖ గ్రానైట్ వ్యాపారిగా కాకుండా రాజకీయంగా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా పేరుంది. గాయత్రి గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతగా ఉన్న ఆయన.. తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్రఅధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధంతో గ్రానైట్ పరిశ్రమల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో వరంగల్ తూర్పునియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెరాసలో చేరారు. గాయత్రి రవి సామాజికసేవలోనూ ముందుంటారు. మేడారం జాతరకు ఏటా ప్రత్యేక విరాళాలుప్రకటిస్తారు. ప్రభుత్వ పాఠశాలలు, దేవాలయాల నిర్మాణాలకు తనవంతు విరాళం అందించారు.

ఖమ్మం జిల్లాతో సుదీర్ఘ అనుబంధం: వద్దిరాజు రవిచంద్ర మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో 1964లో జన్మించారు. వద్దిరాజు నారాయణ, వెంకటనర్సమ్మ. ఇద్దరు పిల్లలు నిఖిల్, గంగాభవాని. గాయత్రి రవి మహబూబాబాద్ జిల్లాలో పుట్టినప్పటికీ.. ఖమ్మం జిల్లాతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఖమ్మం జిల్లా నుంచే గాయత్రి రవి ప్రముఖ వ్యాపార వేత్తగా గుర్తింపు పొందారు. బీకామ్ వరకు చదువుకున్నారు. ప్రస్తుతం గాయత్రి గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతగా ఉన్నారు. జాతీయ అంతర్జాతీయంగా గ్రానైట్ ఎగుమతులతో ప్రత్యేకత సాధించారు. వ్యాపారవేత్తగా, సామాజిక సేవకుడిగా, రాజకీయనాయకుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సుదీర్ఘ అనుభవం ఉంది. జిల్లాలో ప్రముఖ బీసీ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత సీఎం కేసీఆర్ సమక్షంలో రవి తెరాసలో చేరారు. అప్పటి నుంచి ఖమ్మం జిల్లా తెరాస నేతగానే కొనసాగుతున్నారు. గతంలో కొన్ని పదవులు ఆశించినప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో దక్కలేదు. ఖమ్మం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఆశించారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి కట్టబెడతామని సీఎం హామీ ఇస్తే సున్నితంగా తిరస్కరించారు. రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస తరపున బీసీ కులాలను ఏకం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అభినందనలు సంపాదించారు. గాయత్రి రవి సామాజిక సేవలోనూ ముందుంటారన్న పేరుంది. మేడారం జాతరకు ఏటా ప్రత్యేక విరాళాలు ప్రకటించి సేవా గుణాన్ని చాటుకుంటారు. తలసేమియా చిన్నారులకు అవసరం వచ్చినప్పుడల్లా తన వంతు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, దేవాలయాల నిర్మాణాలకు తనవంతు విరాళం అందజేశారు. వద్ధిరాజు రవిచంద్రకి రాజ్యసభ అవకాశ దక్కడంపై ఖమ్మంలో అభిమానులు వేడుకలు చేసుకున్నారు. బుర్హాన్‌పురంలోని ఆయన నివాసం వద్ద బాణాసంచా కాల్చి... శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఖమ్మంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు..

గాయత్రి రవి 2024 ఏప్రిల్ వరకు రెండేళ్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. రాజ్యసభ స్థానం ఊహించలేదని.. తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలని పేర్కొన్నారు. రాష్ట్రం, జాతీయ స్థాయిలో పనిచేసే అవకాశం మున్నూరు కాపులకు కల్పించినందుకు ముఖ్యమంత్రికి మంత్రి గంగుల కమలాకర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఖమ్మం జిల్లాకు బంపర్ ఆఫర్​: బండి పార్థసారధిరెడ్డి 1954లో వేంసూరు మండలం కందుకూరులో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి, సోమకాంతమ్మ. ఇద్దరు పిల్లలు కృష్ణ సింధూరి, వంశీకృష్ణ. కందుకూరులో పదో తరగతి వరకు చదివారు. సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చేశారు. రెడ్డి ల్యాబ్స్​లో రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ విభాగానికి 13 ఏళ్ల పాటు ప్రాతినిథ్యం వహించారు. 1993లో హెటిరో డ్రగ్స్ కంపెనీ సాధించారు. అన్ని బ్రాంచీల్లో కలిపి ప్రస్తుతం 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 100 దేశాలకు పైగా మందులు ఎగుమతి చేస్తున్నారు. హెటిరో కంపెనీ నుంచి కరోనా మహమ్మారికి రెమిడెసివిర్​ ఇంజక్షన్ తయారు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. జిల్లాలో సాయి స్ఫూర్తి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, దేవాలయాలు అభివృద్ధికి విరాళాలు అందజేశారు. స్వస్థలం కందుకూరులో 11వ శతాబ్దం నాటి వెంకటేశ్వర స్వామి ప్రాచీన దేవాలయం పునర్నిర్మాణానికి 2 కోట్లు విరాళం అందజేశారు. స్వగ్రామంలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పూడిక తీత కోసం 6 కోట్లు విరాళం ఇచ్చారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.