ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పల్లె ప్రకృతి వనంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. మండలంలో పిడుగుపాటుకు గురై మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు.
శ్రీశైలం విద్యుత్ ప్రమాదంలో మరణించిన ఇదే మండలానికి చెందిన ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా ఉద్ధృతి: దేశంలో మరో 75 వేల కేసులు నమోదు