రాజ్యసభ సభ్యుడు సంతోష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఖమ్మంలో అనాథలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
ప్రభుత్వ ఉద్యోగులు,ప్రభుత్వాస్పత్రి సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.