ఖమ్మం జిల్లా ఏన్కూరులో జేసీబీ యజమాని కాపుకుంట్ల రవి, ఇసనపల్లి నాగేశ్వరులు ఆధ్వర్యంలో తిమ్మారావుపేట యువకులు... వంద మందికి అన్నదానం చేశారు. లాక్డౌన్లో వలసకూలీలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టారు.
అనంతరం రాయమాదారంలో సర్పంచి, సొసైటీ డైరెక్టర్ కలిసి 150 మందికి ఆహార ప్యాకెట్లను అందజేశారు. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రాకూడదని సర్పంచ్ తెలిపారు. ఒకవేళ బయటకు వస్తే మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పలు చోట్ల కూలీలకు బియ్యం, సరుకులు.. పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేశారు.
ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది