ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆగకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు మత్తడి పోస్తున్నాయి. అలుగు పోస్తున్న చెరువులతో పలు చోట్ల రైతులు, మత్స్యకారులు నష్టపోతున్నారు. కారేపల్లి మండలం పెద్ద చెరువులో 20 క్వింటాళ్ల చేపలు కొట్టుకుపోయాయని పెంపకం దారులు వాపోతున్నారు. బుగ్గవాగు వరద ఉద్ధృతితో వరద నీరు రైల్వే వంతెనకు తట్టింది.
ఇల్లందు మండలంలోని చల్ల సముద్రం చెరువులో ఇటీవల లక్షా ఎనభై వేల చేప పిల్లలను పోశారు. వర్షాల కారణంగా చెరువులో చేపపిల్లలను కాపాడుకునేందుకు పెంపకం దారులు పలురకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఎడతేరిపిలేని వర్షపాతం కారణంగా వ్యవసాయ అధికారులు అప్రమత్తమయ్యారు. సాధ్యమైన మేరకు పంట చేనుల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని అదనపు వ్యవసాయ సంచాలకులు వాసవి రాణి సూచించారు.
ఇదీ చూడండి : ఉగ్ర గోదావరి : మూడో ప్రమాద హెచ్చరిక జారీ