జలాశయాల్లో ఉచితంగా చేపపిల్లలను పోసి మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేయడం ఆనందంగా ఉందని సొసైటీ సభ్యులు అన్నారు. కాంట్రాక్టర్ వ్యవస్థ లేకుండా జీవనోపాధికి కల్పించిందని కొనియాడారు.
ఖమ్మం జిల్లా వైరా జలాశయంలో మత్స్య సహకార సొసైటీ ఆధ్వర్యంలో చేపల వేట ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఇతర రాష్ట్రాల తరలింపునకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు.
నాలుగు మండలాలకు చెందిన 12 వందల మంది మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తున్నారు. జలాశయంలో 4 నెలల పాటు చేపలు పట్టుకోవచ్చని ఎఫ్‌డీఓ శివప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి: మారు పేర్లతో గాలం.. అందిన కాడికి మోసం..