ETV Bharat / state

పాలేరులో చేపల పెంపకంపై విద్యార్థులకు శిక్షణ - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో చేపల పెంపకంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. చేపల పెంపకం, ఆహారం తయారు చేయడం, చేప పిల్లల ఉత్పత్తి వంటి వాటిపై 90 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ధ్రువపత్రాలు అందజేశారు.

fisheries-training-to-students-in-telangana-pv-narasimha-rao-fisheries-research-centre-at-paleru-in-khammam-district
పాలేరులో మత్స్యశాఖపై విద్యార్థులకు శిక్షణ
author img

By

Published : Jan 26, 2021, 7:29 PM IST

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో తెలంగాణ పీవీ నరసింహారావు మత్స్య పరిశోధన కేంద్రంలో చేపల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. పెబ్బేరు కళాశాల విద్యార్థులకు 90 రోజులపాటు శిక్షణ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో చేపల పెంపకం, ఆహారం తయారు చేయడం, చేప పిల్లల ఉత్పత్తి, రోగనిరోధక శక్తి పెరగడానికి చేపట్టే చర్యలు, వల విసరడం, ఈత నేర్చుకోవడం మొదలగు వాటిపై మెళుకువలు నేర్పుతున్నారు. విద్యార్థులకు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ధ్రువపత్రాలు అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోందని... ఉచితంగా 90 రోజుల పాటు శిక్షణ ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. శిక్షణ అనంతరం ఉద్యోగాలు, వ్యాపారానికి అనేక సదుపాయాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. చేపల పెంపకంపై అనేక మెళుకువలు తెలుసుకొని భవిష్యత్తులో బాగా స్థిరపడాలని కోరారు.

ఇదీ చదవండి: 'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'..పోలీసులకు పద్మజ షాక్ !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.