ఖమ్మంలో సీపీఐ ఆధ్వర్యంలో రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. పాత సీపీఐ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేశారు.
కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. నిరసనకారులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని... రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
ఇదీ చూడండి: బియ్యం రాయితీకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం