ETV Bharat / state

'సర్వే నిలిపేయండి' - రహదారి సర్వే

ఖమ్మంలో జాతీయ రహదారి సర్వే గందరగోళంగా మారింది. తమ భూముల్లో రాళ్లు పాతడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే ఆపాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు.

రహదారి సర్వే
author img

By

Published : Mar 5, 2019, 6:26 PM IST

ఆందోళన చేస్తున్న రైతులు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం వద్ద గ్రీన్​ఫీల్డ్​ జాతీయ రహదారి సర్వేను స్థానిక రైతులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా తమ భూముల్లో సరిహద్దు రాళ్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అక్కడికి చేరుకున్న తహసీల్దార్​ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సర్వే నిలిపేయకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

సర్వే నిలుపుదల

రైతుల ఆందోళనతో తహసీల్దార్​ సర్వే నిలిపేశారు. అనంతరం పూర్తి వివరాలతో రైతులు వినతిపత్రాన్ని ఆయనకు అందించారు.

ఇవీ చూడండి :మా రిజర్వేషన్లు మాకు కావాలి

ఆందోళన చేస్తున్న రైతులు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం వద్ద గ్రీన్​ఫీల్డ్​ జాతీయ రహదారి సర్వేను స్థానిక రైతులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా తమ భూముల్లో సరిహద్దు రాళ్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అక్కడికి చేరుకున్న తహసీల్దార్​ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సర్వే నిలిపేయకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

సర్వే నిలుపుదల

రైతుల ఆందోళనతో తహసీల్దార్​ సర్వే నిలిపేశారు. అనంతరం పూర్తి వివరాలతో రైతులు వినతిపత్రాన్ని ఆయనకు అందించారు.

ఇవీ చూడండి :మా రిజర్వేషన్లు మాకు కావాలి

Intro:tg-mbnr-8-4-bourapur-shivaratri-avb-MMc13


Body:నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం నల్లమల అడవిలో ఉన్న భౌరా పూర్ గ్రామంలో శివరాత్రి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది శ్రీశైలం వెళ్లే దారిలో ఫరహాబాద్ చౌరస్తా నుండి 25 కిలోమీటర్లు అడవి లోపలికి వెళితే భౌరాపూర్ చెంచుపెంట వస్తుంది అక్కడికి వెళ్లడానికి అచ్చంపేట నుండి వివిధ జిల్లాల నుండి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు ఇతర ఆలయాలలో మహాశివరాత్రి రోజున నిర్వహించే కళ్యాణోత్సవం వేద వేదపండితుల మంత్రోచ్ఛారణలు జరుగుతుంది కానీ భౌరాపూర్ ఆలయంలో మాత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం చెంచులు సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిం చారు చెంచులు అందరూ కలిసి రెండు సమూహాలుగా ఏర్పడి ఒకరు పెళ్లి కొడుకు వైపు మరొకరు పెళ్లికూతురు వైపు ఉండి కల్యాణం జరిపిస్తారు చెంచుల సంప్రదాయ నృత్యాలతో సాంస్కృతిక ప్రదర్శనలతో భ్రమరాంబ దేవి ని తీసుకువచ్చి మల్లికార్జున స్వామిని తెచ్చి ఎదుర్కోళ్ళు నిర్వహించారు అనంతరం కళ్యాణ వేదిక పైకి తీసుకు వెళ్లారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారు అంగరంగ వైభవంగా భ్రమరాంబ మల్లికార్జునుల కళ్యాణం జరిగింది కళ్యాణం తిలకించడానికి భక్తులు వేలాదిగా వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చారు
ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి స్వామివారికి పట్టు వస్త్రాలను తన అదృష్టంగా భావిస్తున్నానని కేసీఆర్ వచ్చిన తర్వాత పురాతన ఆలయాలను వెలుగులోకి తీస్తున్నాడని రాబోయే కాలంలో బౌరాపూర్ మరో మేడారం గా అవుతుందని అన్నారు చెంచులు చెంచు పెద్దలు అనుమతిస్తే ఈ ఆలయాన్ని ఎండోమెంట్ లో కలిపితే మరిన్ని నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను ఐటీడీఏ చేసింది ఈ కార్యక్రమంలో చెంచు నాయకులు ప్రజా ప్రతినిధులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు


Conclusion:బైట్స్
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.
పి ఓ వెంకటయ్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.