ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురంలో రైతులు రహదారిపై ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం నెల రోజులుగా వర్షాలకు తడిసి పాడవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని.. అమ్మేటప్పుడు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. 40 కిలోల బస్తాకు 10 కిలోల కోత విధిస్తూ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొర్రీలు లేకుండా ఎగుమతులు చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి: RATION CARDS: వేగం పుంజుకున్న కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ