భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా ఏన్కూరులో రైతు సంఘాలు ఆందోళ చేపట్టాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.
పత్తి ధర క్వింటా రూ. 3000కి కొనుగోలు చేస్తుండటంతో ఆ విషయాన్ని అన్ని మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా సీసీఐ కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
ఇదీ చూడండి: జీతం కోసం కాదు.. జీవితం కోసం పోరాడాం: రాజేందర్