ETV Bharat / state

నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఖమ్మం జిల్లా ఏన్కూరులో టాస్క్​ఫోర్స్​ పోలీసులు విత్తనాల దుకాణాలపై సోదాలు నిర్వహించారు. అనుమతులు లేకుండా విత్తనాలు అమ్ముతున్న దుకాణాలను సీజ్​ చేశారు. నిషేధిత విత్తనాలు, ఎరువులు అమ్ముతున్న దుకాణాలపై దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు.

Fake Seeds Caught In Khammam Enkoor
నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
author img

By

Published : Jun 26, 2020, 11:49 AM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరులో టాస్క్​ఫోర్సు పోలీసులు విత్తన దుకాణాలపై దాడులు నిర్వహించారు. విత్తనాలు, ఎరువులు అమ్ముతున్న దుకాణాల్లో సోదాలు చేసిన టాస్క్​ఫోర్స్​ పోలీసులు నిషేధిత విత్తనాల ప్యాకెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిషేదిత విత్తనాల విలువ రూ.4 లక్షల 49 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. అనుమతులు కూడా లేకపోవడం వల్ల టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు రఘు, శ్రీకాంత్​ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.