ఖమ్మంలో ఎక్సైజ్ శాఖ అధికారులు బారుల్లో తనిఖీలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బార్లో నిల్వ ఉంచిన సీసాల కాల పరిమితిని చూశారు. కాలం మించి పోయిన బీర్లను బయట పారబోశారు. మంచిగా ఉన్న వాటిని వైన్స్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని అన్ని షాపుల్లో ఈ తరహా తనిఖీలు ఉంటాయని పోలీసులు తెలిపారు. కాల పరిమితి లేని వాటిని విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవీ చూడండి: మండుటెండల్లో ఒడిశా వలసకూలీల పాట్లు