Ponguleti comments on BRS : బీఆర్ఎస్తో అంతకంతకూ దూరం పెరుగుతున్న వేళ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తన తదుపరి రాజకీయ అడుగులపై వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే పలు సమావేశాల్లో బీఆర్ఎస్లో తనకు గౌరవం దక్కలేదని, ఇబ్బందులు పడ్డానని కార్యకర్తలకు, అనుచరులకు వివరించారు.
ponguleti comments on CM KCR : సోమవారం బోనకల్లులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే విమర్శలు సంధించారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. ఇదే సమయంలో పార్టీలో తనపై జరిగిన కుట్రలు, అవమానాలను ఏకరవు పెట్టారు. కేసీఆర్‌పైనా పొంగులేటి నేరుగా విమర్శలు చేస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు సైతం ప్రతిదాడికి దిగారు.
ponguleti latest comments : జిల్లా ముఖ్యనేతలంతా సమావేశమై శ్రీనివాస్‌రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. గతంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రిని పొంగులేటి కీర్తించిన వీడియోలు ప్రదర్శించారు. పొంగులేటి బీఆర్ఎస్లో లేరనే తాము భావిస్తున్నట్లు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు తెలిపారు. తన స్థాయిని ఎక్కువగా ఊహించుకుని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
జిల్లా రాజకీయలు మరింత రసవత్తరంగా: జిల్లా ముఖ్యనేతలంతా మాజీ ఎంపీ కుట్రలు తెలుసుకుని కలిసికట్టుగా పనిచేయడం వల్లే అన్ని ఎన్నికల్లో పార్టీకి విజయం దక్కిందని తాత మధు స్పష్టంచేశారు. స్వపక్షంలోనే విపక్షంలా మారి పార్టీపై, ప్రభుత్వంపై విమర్శలను పొంగులేటి తీవ్రతరం చేయటం అందుకు బీఆర్ఎస్ నేతలు సైతం దీటుగా బదులిస్తుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
"రాష్ట్రంలో రైతులకు 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎవరికైనా 24 గంటలు ఉచితంగా వస్తుందా?. ఖమ్మంలో చాలా వరకు పూరి గుడిసెలు కనిపిస్తున్నాయి. ఇంకెప్పుడు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇస్తారు? ఇప్పటికి ఎంత మందికి రుణమాఫీ చేశారు? ఇంకా మనం ఇచ్చిన హామీలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో వాగ్దానాలు చేయడమేనా..? హామీలు అమలు పరిచేది ఉందా అని నేను ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అడుగుతున్నాను. "- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ
ఇవీ చదవండి: