ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం గ్రామీణ మండలం కేంద్రంలో తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పర్యటించారు. ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించిన పార్టీ కార్యకర్త తీగల రామారావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
కార్యకర్తల కుటుంబాలకు తెరాస పార్టీ అండగా ఉంటుందని తుమ్మల అన్నారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తల కుంటుబ సభ్యులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: అత్తింటి వేధింపులు... మందమర్రిలో గర్భిణి ఆత్మహత్య..