ETV Bharat / state

Tummala Nageshwararao Comments: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర కామెంట్స్ - Tummala political comments

Tummala Nageshwararao Comments: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తుమ్మల పాల్గొన్నారు. అనంతరం ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Tummala
Tummala
author img

By

Published : Feb 9, 2022, 4:39 PM IST

Tummala Nageshwararao Comments: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గాన్ని కులమతాలకు, పార్టీలకతీతంగా అభివృద్ధి చేశానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తుమ్మల పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో మీ ఆశీస్సులతో బై ఎలక్షన్​లో గెలుపొంది మీ నియోజకవర్గంలోని గ్రామాల ముఖచిత్రాన్ని మార్చేశారన్నారు.

ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల అభివృద్ధి చేశా. ఈ నలభై సంవత్సరాలుగా అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయం చేశా. రాజకీయం కోసం నేను రాజకీయం చేయలేదు.

-- తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి

పాలేరు నియోజకవర్గంలో అన్ని విధాల ప్రభుత్వ పథకాలను అమలు చేసి నియోజకవర్గ ప్రజల అవసరాలను తీర్చినట్లు తుమ్మల తెలిపారు. మూడు సంవత్సరాల్లో సాగునీటిని అందించి నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేశానన్నారు. తద్వారా ఈ ప్రాంత భూముల ధరలకు రెక్కలు వచ్చాయిన్నారు. ప్రజా కోరికతో పార్టీ నిర్ణయంతో మళ్లీ మీ ముందుకొస్తానని ఉద్ఘాటించారు. పలు గ్రామాల్లో పర్యటించిన ఆయనకు అభిమానులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.