రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, మానవహక్కులు చనిపోయాయని కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. అధికారం చేతిలో ఉందని కార్మికుల పోరాటాలను అణచివేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. ఖమ్మం ఆర్టీసీ బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు ఆమె సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ సమస్యలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు స్పందించలేదన్నారు.
ఇవీచూడండి: 'ఆర్టీసీ సమ్మెకు ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు సంపూర్ణ మద్దతు'