ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో 61 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. గతేడాది లారీలు, బస్తాలు, హమాలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడ్డారని కానీ, ఇకపై ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్త వహించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర ప్రకారంమే కొనుగోలు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు, పీఆర్డీవో ఇందుమతి, ఎంపీపీ లక్కినేని అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు