ETV Bharat / state

రికార్డ్స్ కొల్లగొడుతున్న ఉపాధ్యాయుడు - బానోత్ రాందాస్ వార్తలు

పట్టుదల ఉంటే సాధించలేనిదేదీ లేదని నిరూపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన ఉపాధ్యాయుడు. మారుమూల ప్రాంతంలోని ఏజెన్సీలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బానోత్ రాందాస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం దక్కించుకున్నారు. త్వరలోనే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డు రానున్నట్లు రాందాస్ తిరుగుతున్నాడు. ఇంతకీ ఆయన ఏమి చేశాడంటే..

education system books placed on world book of records
మారుమూల ఏజెన్సీలో ఉపాధ్యాయుడు... రికార్డ్స్ కొల్లగొట్టాడు..
author img

By

Published : Feb 19, 2021, 7:36 PM IST

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్లగూడెం గ్రామానికి చెందిన బానోత్ రాందాస్... చిన్ననాటి నుంచి ఆసక్తిగా చదవకపోయినా... డిగ్రీ నుంచి ఫిజిక్స్​పై పట్టు సాధించారు. 2008లో గిరిజన కోటాలో ఉద్యోగం సంపాదించారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే... మరోవైపు పుస్తకాలు రాస్తూ, విద్యా విధానంపై అధ్యయనం చేస్తూ, సెమినార్లకు హాజరవుతూ పీహెచ్​డీ పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎప్పటికైనా ప్రొఫెసర్ అవ్వాలనే ఆసక్తితో ముందుకు సాగుతున్నట్లు రాందాస్ తెలిపారు.

వారి ఆదర్శమే..

తన గురువైన ఫిజిక్స్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, 10వ తరగతిలో ఫిజిక్స్ బోధించిన ఉపాధ్యాయుడు యాదగిరిని ఆదర్శంగా తీసుకొని వారి చేయూతతో... తన అన్నదమ్ముల సహకారంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపాడు. ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకంపై మొదటిసారి పుస్తకం రాసినట్లు వెల్లడించారు. అనంతరం గిరిజన విద్యావ్యవస్థపై... ఇలా విద్యావ్యవస్థపై పదిహేను పుస్తకాలు రచించినట్లు తెలిపారు.

అవార్డులు కొల్లగొట్టి..

మూడు సంవత్సరాలు కష్టపడి 'ఎడ్యుకేషన్ సిస్టం' అనే అతి పెద్ద పుస్తకాన్ని రచించి-ప్రచురించినట్లు తెలిపారు. ఈ పుస్తకానికి ప్రపంచ రికార్డుల పుస్తకంలో చోటు దక్కించుకుందని హర్షం వ్యక్తం చేశారు. 11,796 పేజీలున్న ఈ పుస్తకం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్​తోపాటు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లలో అత్యంత లావైన పుస్తకంగా చోటు దక్కించుకుందని తెలిపారు. తన భార్య సహాయం వల్లనే అనేక పుస్తకాలు రచించినట్లు పేర్కొన్నారు. మన్యంలోని మారుమూల ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామదాసుకు... ఈ అవార్డులు రావడంపట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణతో పాటు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులపై పరిశోధన చేసి... ఎక్కువమంది ఫిజిక్స్​లోనే ఫెయిల్​ అవుతున్నట్లు గుర్తించారు. 2019లో ఏపీ, తెలంగాణల్లో కేవలం 12 శాతం మంది విద్యార్థులు మాత్రమై పాస్ అయ్యారని తెలిపారు. పాఠశాల విద్యపై ప్రాజెక్టు చేసేందుకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: యాదాద్రిలో చూపరులను కట్టిపడేసే శిల్ప సౌందర్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.