ETV Bharat / state

వచ్చే ఏడాదికి సొంత భవనాలు సాధ్యమేనా? - అంకంపాలెం గిరిజన గురుకుల డిగ్రీ  కళాశాల

సౌకర్యాలలేమి సాకుతో దమ్మపేట మండలంలోని అంకంపాలెం గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలను ఖమ్మం సమీపానికి తరలించారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కళాశాల ఇప్పటి వరకు తాత్కాలిక భవనాల్లోనే నడుస్తోంది. శాశ్వత భవనాల నిర్మాణం కోసం గ్రామంలో 7 ఎకరాల భూమి కేటాయించినా, ఇప్పటికీ నిర్మాణం ప్రారంభం కాలేదు. ఏటేటా విద్యార్థినుల సంఖ్య పెరగటం, గదులు సరిపడక ఇబ్బందులు తీవ్రమయ్యాయి.

due to lack of facilities ankampaale girijana gurukul college was shifted to khammam
author img

By

Published : Jul 12, 2019, 11:54 AM IST

ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని అంకంపాలెం గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలను 2017 జులైలో అప్పటి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు గతేడాది వరకు 260 మంది విద్యార్థినులు ఉన్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య దాదాపు 500కు చేరుతోంది.

తొలి రెండేళ్లలో పిల్లలు గదుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరకొర వసతులతో సతమతమయ్యారు. తాత్కాలికంగా విద్యార్థినుల కోసం షెడ్లను నిర్మించినా అవి అవసరాలను తీర్చలేకపోయాయి. ఇక్కడ మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. విద్యార్థినుల సంఖ్య పెరిగితే ఈ ఏడాది ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యాపకుల విజ్ఞప్తి మేరకు ఖమ్మం సమీపంలోని ఓ ప్రైవేట్‌ కళాశాల భవనాల్లోకి మార్చారు.

తరలిపోయిన చదువులమ్మ... తిరిగి వచ్చేదెన్నడమ్మా..?

కోటి రుపాయలతో భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని పీవో గౌతమ్‌ ఐటీడీఏ డీఈఈ రామారావుని ఆదేశించారు. భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యే నాటికే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఇంకెంత కాలం పడుతుందోనని గ్రామస్థులు, విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరలిపోయిన చదువులమ్మ.. తిరిగి తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తుందోనని వాపోతున్నారు.

మన్యం విద్యార్థినులకు ఇబ్బందులే..

మన్యం ప్రాంతంలోని విద్యార్థినులకు అంకంపాలెంలో కళాశాల ఉంటే సౌకర్యంగా ఉంటుంది. గ్రామంలోనే గిరిజన గురుకుల బాలికల జూనియర్‌ కళాశాల, గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు ఒకే ఊళ్లో చదివే అవకాశం ఉండేది.

ఫలించని గ్రామస్థుల పోరాటం

వేరే ప్రాంతానికి తరలించవద్దని గ్రామస్థులు తీవ్ర పోరాటమే చేశారు. ఖమ్మం తరలిస్తే, గిరిజన విద్యార్థినులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ కేటాయించిన స్థలంలో దశలవారీగా భవనాలు నిర్మించుకోవాలని కోరారు. ఇక్కడి నుంచి తరలిస్తే తిరిగి రావడం కష్టమని ఆందోళన చేశారు. గ్రామస్థుల ఆందోళన సమాచారం తెలుసుకున్న భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌ కళాశాలను జూన్‌ 26న సందర్శించారు. వసతుల కొరత కారణంగానే వేరే చోటికి తరలించాల్సి వస్తోందని గ్రామస్థులకు వివరించారు. వచ్చే ఏడాదికి తిరిగి సొంత భవనాల్లోకి తీసుకొచ్చే బాధ్యత తనదని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. పీవో అభ్యర్థన మేరకు గ్రామస్థులు తరలింపును అడ్డుకోలేకపోయారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.