ETV Bharat / state

ఔషధాల కొరత: పదిరోజులుగా నిలిచిన సరఫరా - Khammam Hospital Medicines

కరోనా కాలంలో కీలక ఔషధాలు నిండుకుంటున్నాయి. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పలు ఔషధాల కొరత ఏర్పడింది. గత పది రోజులుగా విటమిన్‌ ‘సి’, అజిత్రోమైసిన్‌ లేకుండానే వైద్యం కొనసాగుతోంది. పీహెచ్‌సీలకు గత నెల మొదటి వారంలో అందజేశారు. అక్కడ వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. జిల్లాలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు పది రోజులుగా మందుల సరఫరా నిలిచిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సమస్య లేదు.

Drugs run out in Khammam District Government Hospital
జిల్లాలో నిండుకున్న ఔషధాలు... పది రోజులుగా నిలిచిన సరఫరా
author img

By

Published : Oct 5, 2020, 1:39 PM IST

కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్నవారికి ఇచ్చే మందుల్లో పై రెండు రకాలు అత్యంత ముఖ్యమైనవి. వాటికి బదులుగా కాల్షియం మాత్రలు, యాంటీబయోటిక్‌ ఇతర మాత్రలు ఇస్తున్నారు. కొవిడ్‌ బాధితులే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి సాధారణ చికిత్సల కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ సమయంలో ముఖ్యమైన మందుల కొరత ఆందోళన కల్గించేదిగా మారింది. జూన్‌, జులై మాసాల్లో వంద దాటని ఓపీ ఇప్పుడు నాలుగు వందలు దాటుతోంది. ఇక కొవిడ్‌ లక్షణాలతో వచ్చే వారి సంఖ్య షరా మామూలే. ప్రతి రోజు 150 మందికి పైగా ఆస్పత్రికి వస్తున్నారు. ఇప్పటికే హోం ఐసోలేషన్‌ ఉన్న వారి సంఖ్య మూడు వేల వరకు ఉంటుంది. ఈ క్రమంలో ఔషధాల కొరత ఏర్పడటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు కూడా కరోనా బాధితులకు కిట్‌లో అందుబాటులో ఉన్న మాత్రలను మాత్రమే అందిస్తూ లేని వాటి కోసం బయటకు రాస్తున్నారు.

కొవిడ్‌ బాధితులకు అజిత్రోమైసిన్‌ తప్పనిసరిగా ఇవ్వాలని లేదని, విటమిన్‌-సి కూడా అవసరాన్ని బట్టి ఇస్తారని ఆర్‌ఎంవో డాక్టర్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఆజిత్రోమైసిన్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రలు, విటమిన్‌-సి కోసం నిమ్మ, ఉసిరి, దానిమ్మ వాడినా సరిపోతుందని తెలిపారు.

తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం

మందుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. విటమిన్‌-సి, అజిత్రోమైసిన్‌ తెప్పిస్తున్నాం. అవసరాలకు తగిన స్థాయిలో మందులు తెప్పించే ఏర్పాట్లు చేశాం. మందుల కొరత అనేది తాత్కాలికమే.-డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు,సూపరింటెండెంట్‌

  • జిల్లా కేంద్ర ఆస్పత్రికి నిత్యం వస్తున్న రోగులు సాధారణ: 400
  • కొవిడ్‌ లక్షణాలు: 150
  • జిల్లాలో హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు: 3,000

ఇవీ చూడండి: 'కాంగ్రెస్ వస్తే వ్యవసాయ చట్టాలు చెత్తబుట్టలోకి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.