లాక్డౌన్ నేపథ్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పేదలకు పలువురు దాతలు అండగా నిలుస్తున్నారు. నిత్యావసర సరుకులు అందజేస్తూ సహాయం చేస్తున్నారు. సత్తుపల్లిలోని అయ్యగారిపేటలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి క్వార్టర్లలోని వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సింగరేణి పీవో సంజీవరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సరుకులు అందజేశారు. కాకర్లపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో సుమారు 3 వందల కుటుంబాలకు తహసీల్దార్ మీనన్ చేతుల మీదుగా నిత్యావసరాలు అందజేశారు.
కిష్టారంలో నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 200 పేద కుటుంబాలకు సర్పంచ్ రేణుక చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందించారు. కొత్తూరులో సర్పంచ్ బొగ్గు విజయలక్ష్మి ఆధ్వర్యంలో 230 కుటుంబాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కల్లూరులో జాతీయ రహదారిపై సుమారు 100 మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లకు స్థానిక ఆరోగ్య వైద్యశాల వైద్యులు పూర్ణచందు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: కేంద్రం అనుమతిచ్చినా.. ఆంక్షలు కొనసాగించేందుకే మొగ్గు!