ఖమ్మంజిల్లా వైరాలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్సీ నాగిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు 327 ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని వక్తలు అన్నారు. పర్యావరణం పరిరక్షణ, ప్లాస్టిక్ వల్ల అనర్థాలు.. నూతన వ్యవసాయ పద్ధతులు వంటి పలు అంశాలపై విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: టీఆర్టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మంది ఎంపిక