కేసీఆర్ ప్రభుత్వం రైతులు రాజు చేసే ప్రభుత్వమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు ప్రాథమిక సహకార సంఘంలో.. నూతన వ్యవసాయ రుణాలను ఎమ్మెల్యే, డీసీసీబీ ఛైర్మన్ నాగభూషణం రైతులకు పంపిణీ చేశారు.
పంట కొనుగోలు.. ప్రభుత్వ లక్ష్యం..
రైతులు పండించిన వరి, మొక్కజొన్న, పత్తి ఇతర పంటను కొనుగోలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాకాలం పంటకు ప్రభుత్వం సహాయంగా రైతుబంధు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు.
రూ.15వేలు ఆర్థిక సహాయం..
అనంతరం వేంసూర్ మండలం భరణిపాడు గ్రామంలో దగ్ధమైన సత్యనారాయణ ఇంటిని ఎమ్మెల్యే సండ్ర వీరయ్య పరిశీలించారు. బాధితులకు రూ.15వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు