ETV Bharat / state

కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం: సీపీఎం

author img

By

Published : Jun 16, 2020, 1:19 PM IST

వైరస్​ను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం కార్యకర్తలు ఆరోపించారు. కేంద్ర విడుదల చేసిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజిని పేదలకు సక్రమంగా చేరేలా చూడాలని ఖమ్మం కలెక్టరేట్​ ముందు ధర్నా చేశారు.

cpm-party-protest-against-central-and-state-government-in-khammam-collectrate
'కరోనాను కట్టడి చేయడంలో విఫలమయ్యారు'

కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఖమ్మంలో సీపీఎం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నిబంధనలు పాటిస్తూ ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.

వైరస్​ను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. లాక్​డౌన్​ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజిని పేదలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: పేట్లబురుజు ఆస్పత్రిలో 32 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.