ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యురాలిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నిండు గర్భిణీ నొప్పులతో అందులోనూ రక్తస్రావం అవుతుంటే కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయకుండా చోద్యం చూశారని ఆరోపించారు. బాధితురాలికి మద్దతుగా మాట్లాడిన సీఐటీయుూ నాయకున్ని మర్యాద లేకుండా దుర్భాషలాడిందని తెలిపారు. వైద్యురాలిని వెంటనే విధుల నుంచి తొలగించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'హార్దిక్‌ను 2 వారాలు నాకు వదిలేయండి..'