సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉంటే అది సీపీఐ అని రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. రాష్ట్రంలో తెరాస ఫిరాయింపుల పార్టీగా మారిందని చాడా విమర్శించారు. ప్రజల కోసం పాటుపడే కమ్యూనిస్టు పార్టీలనే గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి కల్లూరి వెంకటేశ్వర రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎంపీ మిడియం బాబురావు, మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జి, జిల్లా అధ్యక్షులు సాబీర్ షా పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఈబీసీ కోటాపై ఏప్రిల్ 8న సుప్రీం విచారణ